← Back to news

వినాయక నిమజ్జనంలో విషాదం

By vanjarapu Yellam· 1d ago· Masaipet, Masaipet, Medak
వినాయక నిమజ్జనంలో విషాదం

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్లిన కామిండ్ల గణేష్ (35), గంగమ్మ గుడి సమీపంలోని హల్దీ డ్యామ్ బ్రిడ్జి వద్ద వాగులో గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే సమాచారం అందడంతో పోలీసులు, గజ ఈతగాళ్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గణేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వినాయక నిమజ్జనంలో విషాదం
వినాయక నిమజ్జనంలో విషాదం

More in Local