వర్ధన్నపేటలో వరుస వైన్‌షాపుల చోరీ
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వైన్‌షాపుల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. మల్లికార్జున వైన్స్‌లో 3.60 లక్షలు, రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో 65 వేల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఇదే నెలలో శ్రీనివాస వైన్స్‌లో 90 వేల చోరీ జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఘటనలపై పోలీసులు ఎంక్వేరీ చేపట్టాల్సి ఉంది.



