హొళగుందలో అభివృద్ధి పనులు చేపట్టాలి

కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ TDP సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద గౌడ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను కోరారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని రెవెన్యూ సమస్యలతో పాటు తాగునీరు, సాగునీరు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.



