← Back to news

లింగాల కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

By BOLAGANI SAIDULU· 17h ago· Suryapet
లింగాల కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి నిరంతరం కొనసాగాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

More in Local