విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం NSS (జాతీయ సేవా పథకం) దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఏ. దేవస్వామి, NSS PO ఏ. మురళి, ల్యాబ్ అటెండెంట్ ఎస్. అశోక్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో NSS లక్ష్యాలు, సమాజ సేవలో దాని ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.




