మీటింగ్‌కు వెళ్లనివ్వలేదు: మమతా బెనర్జీ
కోల్‌కతాలో తన మీటింగ్‌కు 15 రోజుల ముందే కోర్టు పర్మిషన్ తీసుకున్నామని, అయినా తనను ఇంటి నుంచి బయటకు రానివ్వలేదని మాజీ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. కొన్ని రోడ్లను బ్లాక్ చేశారని, అక్కడ పోలీసులు కనిపించలేదని చెప్పారు. TMC నేత కునాల్ ఘోష్ కారును డ్యామేజ్ చేసి, ఆయనపై దాడి చేశారని తెలిపారు. ఈ పరిస్థితి డెమోక్రసీకి మంచిది కాదన్నారు. పోలీసులు బీజేపీకి ఫేవర్‌గా పనిచేస్తున్నారని, ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం దారుణమని అన్నారు

