← Back to news

'రైల్వేస్టేషన్‌లో వాటర్‌ఫాల్'.. కాంగ్రెస్ సెటైర్

By Krishna· 7h ago· X

వారణాసి రైల్వేస్టేషన్‌లో ఓ వాటర్‌ఫాల్‌ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ సెటైర్ వేసింది. వర్షం పడుతున్న సమయంలో.. స్టేషన్‌ ప్లాట్‌‌ఫామ్‌ పైనుంచి లీకై పడుతున్న నీటిని వీడియోలో చూపిస్తూ.. ప్రధాని మోదీ లీడర్‌షిప్‌లో ఇది ప్యాసింజర్లకు కల్పించిన అల్ట్రా మోడ్రన్ ఫెసిలిటీ అని కామెంట్స్ చేసింది. ప్యాసింజర్స్ వచ్చి.. వాటర్‌ఫాల్‌ని ఎంజాయ్ చెయ్యాలని కోరింది. నెటిజన్లు తమదైన రియాక్షన్స్ ఇస్తున్నారు. మీకేమనిపిస్తోందో కామెంట్ చెయ్యండి.

More in National