చెరువును తలపిస్తున్న నిడదవోలు బస్టాండ్

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వర్షం పడితే నీటితో నిండిపోతోంది. బస్టాండ్ ప్రాంగణంలో భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు నీటిలోనే నడవాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఇదే సమస్య పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.



