తెలంగాణలో JDRF విస్తరణ..

ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకంగా ఉన్న జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (JDRF) తెలంగాణకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. జర్నలిస్టుల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే లక్ష్యమని JDRF జాతీయ అధ్యక్షుడు పూలతోట కృష్ణ తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల సమస్యలు, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా జర్నలిస్టుల గుర్తింపు, ఉద్యోగ భద్రత, రక్షణ, మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం, జర్నలిస్టుల సంక్షేమంపై విస్తృతంగా చర్చించారు.




