← Back to news

తాండూరులో పోలీసుల తనిఖీలు

By Naresh Kumar· 1d ago· Vikarabad
తాండూరులో పోలీసుల తనిఖీలు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు, డీఎస్పీ ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 42 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More in Local