← Back to news

కోదాడలో లారీ ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

By Bala· 2h ago· TG
కోదాడలో లారీ ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఇవాళ రెండు లారీలు ఢీకొన్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టడంతో అదుపుతప్పి హైదరాబాద్‌ వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రహదారిపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

More in TG