← Back to news

రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు

By BK· 23h ago· ఖమ్మం
రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు

ఖమ్మం జిల్లా ఏన్కూరులో కొంచెం వాన పడినా రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. డ్రైనేజీలు బ్లాక్ అవ్వడంతో వర్షపు నీరు మోకాళ్ల లోతులో నిలిచిపోతోంది. బైకులు, కార్లు వెళ్తున్నప్పుడు ఆ వాటర్ వచ్చి పక్కన నడిచేవాళ్లపై చిమ్ముతోంది. చెత్తను క్లీన్ చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్ అని, పంచాయతీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని స్థానికులు ఫైర్ అవుతున్నారు. వెంటనే ఈ ఇష్యూని సాల్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local