వయోవృద్ధుల సంక్షేమమే లక్ష్యం.. పోస్టర్ ఆవిష్కరణ!

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం-2026 సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకలెక్టరేట్‌లో ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ పోస్టర్‌ను విడుదల చేశారు. వయోవృద్ధుల భద్రత, సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అక్టోబర్ 1న జరిగే ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వయోవృద్ధులకు తగిన గౌరవం ఇవ్వడం, వారి సాధికారతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.




