గేదెలను తప్పించబోయి గూడ్స్ వాహనం బోల్తా

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారులో గూడ్స్ వాహనం బోల్తాపడింది. తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వాహనం మార్గమధ్యంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డుపైకి రావడంతో డ్రైవర్ వాటిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనలో వాహనం కొంతమేర దెబ్బతింది. రహదారులపై పశువులు అకస్మాత్తుగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



