వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి

వినాయక నిమజ్జన సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మహబూబాబాద్ జిల్లా గూడూరు CI వినయ్ కుమార్ సూచించారు. చెరువులు, నీటి కుంటల్లో నీటి లోతును ముందుగా అంచనా వేసిన తర్వాతే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పారు. ఈత రాని వారు, చిన్నారులు నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిమజ్జన కార్యక్రమాల్లో DJల వినియోగాన్ని నిషేధించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.



