← Back to news

మాదాపూర్‌లో యాంటీ డ్రోన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.

By Nani Eluri· 17h ago· Instagram

TG: హైదరాబాద్ మాదాపూర్‌లో యాంటీ డ్రోన్ పరికరాలను టెస్ట్ చేసే సెంటర్‌లో ఫైర్ అయింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సమాచారం అందడంతో ఫైర్ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే అసలు ఫైర్ ఎలా అయింది? దీనికి కారణమేంటనే విషయం ఇంకా తెలియలేదు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు.

More in TG