← Back to news

రైతాంగాన్ని ఆదుకుంటాం: MLA కొండ్రు

By M.Mahesh (Journalist )· 18h ago· Ramarayapuram, Santhakaviti, Vizianagaram
రైతాంగాన్ని ఆదుకుంటాం: MLA కొండ్రు

విజయనగరం జిల్లా తకవిటి మండలం రామరాయపురం, మల్లయ్యపేట గ్రామాలను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గురువారం పర్యటించారు. తుఫాన్ కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను, పూర్తిగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న పంటలు, సాగు విస్తీర్ణం, రైతులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

More in Local