నెల్లూరులో 29న సిఎం టూర్

ఈ నెల 29న నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జి రాంజీ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తో కలిసి రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు.



