← Back to news

ముక్తార్ పాషా, పైలా చంద్రమ్మలకు నివాళులు

By SHAIK SUBHANI· 1d ago· Madugula, Gurajala, Palnadu
ముక్తార్ పాషా, పైలా చంద్రమ్మలకు నివాళులు

గుంటూరు జిల్లా అరండల్‌పేటలోని కామ్రేడ్ మాదాల నారాయణస్వామి భవన్‌లో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ నాయకులు, IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే. ముక్తార్ పాషా, శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ పైలా చంద్రమ్మల 6వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర నాయకులు యు. గనిరాజు, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌వీ. కృష్ణ మాట్లాడుతూ.. వారి ఆశయాల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

More in Local