వరి పొలాలకు వరంగా మారిన వర్షం: వీరభద్ర

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఎండిపోయే దశకు చేరిన వరి పొలాలకు ఊరటనిచ్చాయని గ్రామీణ పేదల హక్కుల వేదిక జిల్లా కన్వీనర్, ప్రజాసంఘాల నాయకుడు కొనకంచి వీరభద్ర తెలిపారు. గత మూడు నెలలుగా సరైన వర్షపాతం లేకపోవడం బాధాకరమన్నారు. ఈ అకాల వర్షాలతో రైతులకు కొంతమేర ప్రయోజనం కలుగుతుందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో వర్షాలు లేక రైతులు నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు రైతుల్లో మళ్లీ ఆశలు కలిగించాయని వీరభద్ర పేర్కొన్నారు.



