← Back to news

పిడుగురాళ్లలో మున్సిపల్ కార్మికుల మానవహారం

By ORSU KRISHNA· 19 Aug 2026· Piduguralla, Piduguralla, Palnadu
పిడుగురాళ్లలో మున్సిపల్ కార్మికుల మానవహారం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ మేనేజర్ షేక్ అబజల్ ఖాన్‌కు అందజేశారు.

More in Local