బాలికతో BJP నేత ప్రవర్తనపై పోక్సో కేసు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అక్టోబర్ 15న కనకేశ్వరి గార్బా పండాల్లో బీజేపీ మండల్ అధ్యక్షుడు కమల్ చౌహాన్ 15 ఏళ్ల బాలికను తోసేసిన వీడియో వైరల్ అయింది. ఎంట్రీ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన బ్యారికేడ్ దాటి బాలిక చేయి పట్టుకుని పలుమార్లు బయటకు నెట్టినట్లు వీడియోలో కనిపించింది. బాలిక వద్దని చెబుతున్నా ఆయన ఆపలేదని ఆరోపణలు వచ్చాయి. బాలిక ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం, BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

