భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం రింతాడ-2 పంచాయతీ కొత్తబంద గ్రామానికి చెందిన గెమ్మెలి చిన్నమ్మి భర్త బాలన్న మాట్లాడుతూ.. నిన్న, ఇవాళ కురిసిన భారీ వర్షాలకు తమ పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయని తెలిపారు. పంట నష్టంపై అధికారులు స్పందించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధిత రైతులకు తగిన సహాయం అందించాలని పంచాయతీ అధికారులను కోరారు.



