హైటెన్షన్.. పోలీసులతో నరేన్ రెడ్డి ఫైర్
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో ఉద్రిక్తత నెలకొంది. YCP ఇన్ఛార్జ్ నరేన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. TDP నుంచి ముప్పు ఉందన్న కారణంతో పార్టీ కార్యాలయం నుంచి ఆయనను తరలించేందుకు యత్నించగా, నరేన్ రెడ్డి తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకించారు. TDP కార్యకర్తలు గుమిగూడితే చర్యలు తీసుకోకుండా తమను అరెస్ట్ చేయాలని చూడటం దారుణమంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.



