'సమస్యల సుడిగుండంలో సూర్యాపేట'

TG: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం జూన్ 2వ తేదీ నుంచి సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేటలోని కామ్రేడ్ విక్రమ్ భవన్‌లో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అలుపెరగని ఉద్యమ పోరాటాలు చేసి, ఎందరో ఉద్యమకారులకు జన్మనిచ్చిన సూర్యాపేట నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు.


