← Back to news

సుబ్బంపేట తీరంలో జేసీ పర్యటన

By DK· 2h ago
సుబ్బంపేట తీరంలో జేసీ పర్యటన

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట తీరప్రాంతంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తీరప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సముద్ర తీర ప్రాంతం, పరిసర జనావాసాలను క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రభావితమయ్యే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

More in Local