← Back to news

ప్రైవేట్ హాస్పిటళ్లకు DMHO వార్నింగ్

By Yadav· 20h ago· Mahabubabad
ప్రైవేట్ హాస్పిటళ్లకు DMHO వార్నింగ్

పర్మిషన్లు, సరైన సర్టిఫికెట్లు లేకుండా హాస్పిటళ్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని DMHO డాక్టర్ రవి రాథోడ్ హెచ్చరించారు. ఇవాళ మహబూబాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం రేట్ల చార్టులు, డాక్టర్ల వివరాలు, ల్యాబ్ రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేశారు. రూల్స్ ప్రకారం రికార్డులు మెయింటెన్ చేయాలని, నిబంధనలు తప్పక పాటించాలని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు స్పష్టం చేశారు.

More in Local