ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు. కర్బల మైదాన్, నెక్లెస్ రోడ్‌లో జరిగిన వేడుకల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అడ్డగుట్ట పహాడీ హనుమాన్ దేవాలయం వద్ద జరిగిన వేడుకల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పాల్గొన్నారు. అనంతరం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.



