కస్తూర్బా గాంధీ స్కూల్ భోజనంలో పురుగులు

నెల్లూరు జిల్లా కలిగిరి KGBVలో విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదిరోజుల క్రితం మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించగా, తాజాగా ఉదయం వడ్డించిన ఉప్మాలోనూ పురుగులు ఉన్నట్లు విద్యార్థినులు గుర్తించారని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో విద్యార్థినులు ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.



