← Back to news

సత్యకృపాల్ డాంగే సంస్మరణ సభ

By BUJJIBABU· 21h ago· Guntur

మంగళగిరి అవ్వరు సత్యకృపాల్ డాంగే సంస్మరణ సభ పెద్దవడ్లపూడి వై కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హనుమంతరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయరావు అతిథులుగా హాజరై డాంగే ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా ఉద్యమాల్లో డాంగే చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. CPM లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More in Local