ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల బిగ్ ఆపరేషన్

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. 50 లక్షల విలువైన 87 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మన్నూరు పరిధిలో 42, వీరబల్లిలో 8, ఖాజీపేటలో 37 దుంగలను పట్టుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన 5 వాహనాలను కూడా సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.



