పెరిగిన ధరలు.. బియ్యం కోసం క్యూ
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బియ్యం ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం రైతు బజార్లో శనివారం ఉదయమే స్థానికులు పెద్దఎత్తున బియ్యం కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో కుటుంబ ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



