ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
TG: అదుపుతప్పిన కారు ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ముత్తజిపేటలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గంధంపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు కారులో మేడారం వెళ్తుండగా ముత్తజిపేట సమీపంలో కారు అదుపుతప్పింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది నాగరాజు, పాషా ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు.



