వర్షాలను ఆసరాగా చేసుకుని వ్యర్థాలు వదులుతున్నారు

వర్షాల సమయంలో ఫార్మా పరిశ్రమల నుంచి వ్యర్థాలు, కాలుష్య ద్రవాలను చెరువుల్లోకి విడుదల చేస్తున్నారంటూ అనకాపల్లి జిల్లా పరవాడ పరిసర గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత నీటితో సాగునీటి చెరువులు ప్రభావితమవుతున్నాయని, పంటలు దెబ్బతినడంతో పాటు పశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందన్నారు. వర్షాలను ఆసరగా చేసుకుని వ్యర్థాలను చెరువుల్లోకి వదులుతున్నారన్న ఆరోపణలపై APPCB అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



