రైతులు పుకార్లు నమ్మొద్దు : కలెక్టర్ ప్రతిమాసింగ్

TG: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు పుకార్లను నమ్మి మోసపోవద్దని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నర్సాపూర్ మండలం తుల్జారంపేట్ గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నిన్న కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా 400 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని రిపోర్ట్ ఉందని, ఆరబెట్టి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించి రైతులకు న్యాయం చేస్తామన్నారు.



