← Back to news

బొంబాయి పొట్టేలు – కథల పుస్తకం

By Vishi· 6h ago
బొంబాయి పొట్టేలు – కథల పుస్తకం

కథకుడు, చిత్రకారుడు చరణ్ పరిమి రాసిన రెండో కథల పుస్తకం ‘బొంబాయి పొట్టేలు’. రేగి అచ్చులు ప్రచురణ సంస్థ దీన్ని ప్రచురించింది. అబ్‌స్ట్రాక్ట్, సర్రియల్ టచ్‌తో సాగే ఈ కథలు సమాజంలోని అనేక కోణాలను కొత్తగా చూపిస్తాయి. అసమానతలు, వివక్ష, మనుగడ పోరాటాలను ఎదుర్కొనే పాత్రలు ఈ కథల్లో కనిపిస్తాయి. ఈ పుస్తకానికి రచయిత డా.వేంపల్లె షరీఫ్ ముందుమాట రాశారు. రచయిత చరిత్రను, ఆధిపత్య సంస్కృతి రాజకీయాలను అర్థం చేసుకుని రచయిత ఈ కథలు రాశారని ఆయన వివరించారు. దీని ధర రూ.170. పుస్తకం కొనే <a href="https://books.ataka.in/products/bombay-pottelu?_pos=1&amp;_psq=bombay&amp;_psid=3417bd527&amp;_ss=e">లింక్</a>.

More in Arts/Literature