క్రియేటివిటీ తగ్గిపోతోందా?: రచయిత డాన్ కో

వేగవంతమైన, డిజిటల్ ప్రపంచంలో కొత్త సృజనాత్మక ఆలోచనలు పెంచుకోవడం సవాలుగా మారిందని ప్రముఖ అమెరికన్ రచయిత, డిజిటల్ క్రియేటర్ డాన్ కో(Dan Koe) అన్నారు. ఈ జీవనశైలి మనుషులలోని క్రియేటివ్ ఆలోచనలకు స్థానం లేకుండా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రచనలో పురోగతి సాధించాలంటే రోజూ ఉదయాన్నే ఒక గంట సమయాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కేటాయించాలని X పోస్ట్ ద్వారా సూచించారు. క్రియేటివ్ ఆలోచనలు రావాలంటే ప్రశాంతమైన స్థలం, టైం అవసరం అన్నారు.



