← Back to news

చింతూరు ఏజెన్సీలో టూరిస్ట్ స్పాట్స్ క్లోజ్

By DK· 1d ago
చింతూరు ఏజెన్సీలో టూరిస్ట్ స్పాట్స్ క్లోజ్

భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో పర్యాటకుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నారు. మోతుగూడెం, పోలవరం, ఫోర్ బే క్యాంపు, వాటర్ ఫాల్స్, డొంకరాయి ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చింతూరు CI గోపాలకృష్ణ తెలిపారు. తుఫాను ప్రభావంతో ఏజెన్సీలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

More in Local