బాలల సంక్షేమ కేంద్రాల పరిశీలన

గుంటూరు జిల్లాలో బాలల సంక్షేమానికి సంబంధించిన పలు కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏ.వి.ఎస్. సూర్య నారాయణ రాజు, కమిషన్ సభ్యులు సందర్శించి పరిశీలించారు. పోస్టల్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో ఆహార పట్టిక, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు.



