NSS PO విజయలక్ష్మికి ప్రత్యేక గుర్తింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS Day సందర్భంగా కళాశాలలోని మూడు NSS యూనిట్ల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2025–26లో ఆర్. డుంబ్రిగూడ, రవ్వలగూడ, గద్యగూడ గ్రామాలను దత్తత తీసుకుని అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, యోగా, స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తమ NSS POగా జిల్లా, ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాయి అవార్డ్, National సేవా ఐకాన్ అవార్డు అందుకున్న విజయలక్ష్మిని కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు.



