← Back to news

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

By NANI M· 19 Aug 2026· Rowthulapudi, Rowthulapudi, Kakinada
సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

AP: కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెండింగ్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా సీఎం చంద్రబాబును కోరారు. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించడంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

More in Local