← Back to news

కూలిన ఇల్లు.. సాయం కోసం ఎదురుచూపు

By MOHAMMED· 1d ago· Raiparthy, Rayaparthy, Warangal
కూలిన ఇల్లు.. సాయం కోసం ఎదురుచూపు

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలో వర్షాలకు ఓ నిరుపేద కుటుంబం ఇల్లు కూలిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దడిగెల నర్సమ్మకు చెందిన ఇల్లు గురువారం ఉదయం నేలమట్టమైంది. గోడలు, ఇంటి నిర్మాణం పూర్తిగా తడిసిపోవడంతో ఇల్లు కూలిపోయినట్లు బాధిత కుటుంబం తెలిపింది. తమ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని నర్సమ్మ కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి తమకు అండగా నిలవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

More in Local