మద్యం మత్తులో హల్‌చల్.. భార్యపై దాడి!

TG: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బస్ డిపో దగ్గరలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన సదరు వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. అతడిని తీసుకెళ్లడానికి వెనుక భార్య రాగా.. <a href="https://x.com/pulsenewsbreak/status/2097714895777354084">చౌరస్తాలో ఆమెను కొట్టాడు</a>. అదే సమయంలో ఆటు వైపు వచ్చిన RTC బస్సును ఆపి డ్రైవర్‌ను తిట్టాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తర్వాత కుటుంబ సభ్యులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.



