← Back to news

కాలేజీ దగ్గర న్యూసెన్స్.. యువకుడికి 8 రోజుల జైలు

By Sunke Vinith· 5h ago
కాలేజీ దగ్గర న్యూసెన్స్.. యువకుడికి 8 రోజుల జైలు

TG: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నేరేడ్‌మెట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర న్యూసెన్స్ సృష్టించిన యువకుడు మోత్కూరు మహేష్ (21)పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీపీ యాక్ట్‌లోని 70(ఏ), 70(బి), 70(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా, ఆయనకు 8 రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. విద్యాసంస్థల పరిసరాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నేరేడ్‌మెట్ పోలీసులు హెచ్చరించారు.

More in Crime