వీడియోలను చూసి మోసపోయాం: తండ్రీకొడుకులు

యూట్యూబర్ నందన వీడియోలు చూసి, నమ్మి మోసపోయామని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన ఒక బాధితుడు తెలిపాడు. "మా అబ్బాయి 'నాన్న నేను అక్కడికెళ్ళి బతుకుతా' అనడంతో.. ఉన్న 2 ఎకరాల పొలం అమ్మి 16 లక్షలు ఇచ్చాను. నా కొడుకు కూడా 4 లక్షలు ఇచ్చాడు" అని చెప్పారు. మొత్తం 20 లక్షలు తీసుకుని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడంలేదని, తమను దారుణంగా మోసం చేసిందని బాధితుడు చెప్పాడు.



