← Back to news

పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి

By Ravi Gaddam· 20 Aug 2026· నిజామాబాద్ జిల్లా

TG: బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు నిరసనకు దిగారు. నిజామాబాద్ జిల్లా దుబ్బలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వద్ద ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ‘పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. బాన్సువాడలో పోచారం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

More in Local