← Back to news

డంపింగ్ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే

By DK· 6h ago
డంపింగ్ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా రాయదుర్గం శాంతినగర్ డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు పనులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. రాయదుర్గం మున్సిపాలిటీకి వచ్చిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే సుమారు 87 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేశామని, మిగిలిన చెత్తను మరో మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

More in Local