పొట్టకూటి కోసం వ్యాపారం.. ప్రాణాలతో చెలగాటం

TG: హైదరాబాద్ KPHB కాలనీ పవర్ స్టేషన్‌కు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ కింద కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు అత్యంత సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రమాదాలు జరిగితే వ్యాపారులతో పాటు అక్కడికి వచ్చే ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.





