← Back to news

‘వయోలిన్‌ల రాజధాని’.. ఎక్కడుందో తెలుసా?

By Vishi· 23h ago
‘వయోలిన్‌ల రాజధాని’.. ఎక్కడుందో తెలుసా?

ఇటలీ దేశంలోని క్రెమోనా నగరాన్ని ‘వయోలిన్ల రాజధాని’ అని పిలుస్తారు. 16వ శతాబ్దం నుంచి ఇక్కడ అత్యంత నాణ్యమైన వయోలిన్లను తయారుచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ తయారీదారులైన అంటోనియో స్ట్రాడివారి, ఆండ్రియా అమాటి, గుఆర్నేరి లాంటివారు ఇటలీకి చెందినవారే. వీరు తయారుచేసిన పాతకాలపు ‘స్ట్రాడివారియస్’ వయోలిన్లకు ప్రపంచంలోనే కోట్ల రూపాయల విలువ ఉంది. క్రెమోనా నగరంలో పాటించే సాంప్రదాయ వయోలిన్ తయారీ కళను యునెస్కో సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది.

More in Infotainment