పోస్టర్లతో HIV, AIDS నివారణపై అవగాహన

HIV, AIDSతో పాటు లైంగిక వ్యాధులపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి వారిలో అవగాహన పెంచాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రతో కలిసి ప్రత్యేక అవగాహన పోస్టర్లను ఆమె ప్రారంభించారు. ప్రజలకు ఉన్న సందేహాలను నివారించడం కోసం ఈ పోస్టర్లలో ప్రత్యేకంగా QR కోడ్‌ను ఏర్పాటు చేశామని, దాన్ని స్కాన్ చేసి సరైన, నమ్మకమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.



